నేడు ప్రతి రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (కృత్రిమ మేధ-ఏఐ) దూసుకుపోతుంది. ఏఐపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. దీని వల్ల చాలా మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఏఐ వల్ల కలిగే నష్టాల సంగతి పక్కకు పెడితే పలు రంగాల్లో అది చేస్తోన్న అద్భుతాలు అందరిని ఆకర్షిస్తున్నాయి. ఇక తాజాగా ఏఐ వల్ల అద్భుతం సాకారం అయ్యింది. సుమారు 18 ఏళ్లుగా పిల్లల కోసం ఎదురు చూస్తున్న ఓ జంట కలను ఏఐ సాకారం చేసింది. ఏఐ సాయంతో మహిళ గర్భం దాల్చింది. అదేలా సాధ్యం అయ్యింది.. అసలేం జరిగిందో తెలియాలంటే ఇది చదవండి.
సంతానం కోసం 18 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఒక జంట కల కృత్రిమ మేధ ఏఐ సాయంతో సాకారమైంది. అజూస్పర్మియా అనే సమస్యతో బాధపడుతున్న భర్త వీర్యం నుండి, ఏఐ టెక్నాలజీతో ఒక వీర్యకణాన్ని గుర్తించి, ఐవీఎఫ్ పద్ధతి ద్వారా భార్య గర్భం దాల్చింది. ఈ సంఘటన వైద్య చరిత్రలో ఒక సంచలనంగా మారింది.
అనంతపురంవాసులు ఇకపై బెంగళూరుకు ఈజీగా వెళ్లొచ్చు.. జస్ట్ రూ.50మాత్రమే, ఆ రైలు పొడిగించారు.. ఫుల్ డిమాండ్
మొన్నేమో 90 డిగ్రీల బ్రిడ్జి, ఇప్పుడేమో పాములా మెలికలు తిరిగిన వంతెన.. ఇంజినీర్ల పనితనం మామూలుగా లేదుగా!
గ్రౌండ్ నుంచి సినీ ఇండస్ట్రీలోకి.. నటుడిగా మారిన సురేష్ రైనా
పెళ్లై ఏళ్లు గడుస్తున్నా సంతానం కలగకపోవడంతో ఆ దంపతులు చాలా బాధపడ్డారు. అయితే సదరు మహిళ భర్తకు అజూస్పర్మియా అనే సమస్య ఉంది. అంటే అతని వీర్యంలో వీర్యకణాలు చాలా తక్కువగా ఉంటాయి. వాటిని పరీక్షల్లో గుర్తించడం కూడా కష్టం అని వైద్యులు కూడా తెలిపారు. దీంతో ఆ దంపతులు ఐవీఎఫ్ ద్వారా పిల్లలను కనాలని చాలా ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. సంతానం కోసం చాలా దేశాలలోని డాక్టర్లను సంప్రదించినా ఉపయోగం లేకపోయింది. ఇక లాభం లేదనుకున్న సమయంలో, వారు చివరి ప్రయత్నంగా కొలంబియా యూనివర్సిటీ ఫర్టిలిటీ సెంటర్‌ను (సీయూఎఫ్‌సీ) సంప్రదించారు.
ఈ జంట సమస్య తెలుసుకున్న అక్కడ పరిశోధకులు ఒక కొత్త టెక్నిక్‌ను ఉపయోగించారు. స్పెర్మ్ ట్రాకింగ్ అండ్ రికవరీ (ఎస్‌టీఏఆర్-స్టార్) అనే విధానంలో మహిళ భర్త వీర్యంలో దాగి ఉన్న ఒక వీర్యకణాన్ని కష్టపడి గుర్తించారు. ఆ వీర్యకణంతో ఐవీఎఫ్ పద్ధతిలో భార్య అండంతో ఫలదీకరణం చెందేలా చేశారు. ఆ తరువాత దానిని ఆమె గర్భాశయంలోకి ప్రవేశపెట్టారు. దీంతో ఆ మహిళ గర్భం దాల్చింది. ఈ విధానంలో గర్భం దాల్చిన మొదటి మహిళగా ఆమె గుర్తింపు పొందింది.
తన కల నిజం కాబోతోందని తెలుసుకున్న ఆ మహిళ చాలా సంతోషించింది. ఆమె మాట్లాడుతూ, ఇది నిజమని నమ్మడానికి నాకు రెండు రోజులు పట్టింది అని తెలిపింది. తన సంతోషాన్ని వర్ణించడానికి మాటలు చాలడం లేదంది. సీయూఎఫ్‌సీ డైరెక్టర్ డాక్టర్ జెవ్ విలియమ్స్ ఆధ్వర్యంలోని పరిశోధకుల బృందం దాదాపు ఐదేళ్ల పాటు కష్టపడి ఈ స్టార్ విధానాన్ని అభివృద్ధి చేసింది. ఈ విధానం అద్భుతమైన ఫలితం ఇవ్వడంతో పరిశోధకుల బృందం కూడా ఆశ్చర్యపోయింది.
ఈ సందర్భంగా డాక్టర్ విలియమ్స్ మాట్లాడుతూ ఆ పేషెంట్ మాకు శాంపిల్ ఇచ్చారు. అందులో వీర్య కణం కోసం నిపుణులు రెండు రోజుల పాటు వెతికినా ఒక్కటి కూడా కనిపించలేదు. కానీ స్టార్ విధానంలో శాంపిల్‌ను పరిశీలిస్తే కేవలం గంటలోనే వీర్య కణాల జాడ బయటపడింది. కేవలం గంట వ్యవధిలో 44 వీర్య కణాలను గుర్తించాము. ఇది వైద్య రంగంలో ఒక గొప్ప మలుపు అని మాకు అప్పుడే అర్థమైంది. ఇది చాలా మంది జీవితాల్లో ఆనందాన్ని నింపుతుంది అని అన్నారు. ఈ కొత్త టెక్నాలజీతో పిల్లలు లేని దంపతులకు ఒక కొత్త ఆశ చిగురించింది. ఏఐ టెక్నాలజీ సాయంతో సంతానం పొందడం అనేది నిజంగా ఒక అద్భుతం అంటున్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa