AP: శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం వసపలో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన మిన్నారావు అనే యువకుడు మద్యం సేవించి స్థానికంగా ఉన్న ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌కు వెళ్లాడు. చికెన్ పకోడి కావాలని షాపు యజమాని శంకర్‌ని అడగగా.. లేదని చెప్పాడు. దాంతో శంకర్‌పై దాడి చేసేందుకు మిన్నారావు ప్రయత్నించాడు. ఈ క్రమంలో మిన్నారావు తలపై శంకర్ సుత్తితో కొట్టి కత్తితో పీక కోశాడు. మృతదేహాన్ని కాలువలో పడేసి పరారయ్యాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa