డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా చీరాల నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ కరణం వెంకటేష్ మంగళవారం క్లాక్ టవర్ సెంటర్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్సార్ అనేక సంక్షేమ పథకాల ద్వారా పేదలకు కూడు, గూడు కల్పించారన్నారు. అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా లక్షలాది మంది ప్రాణాలు నిలబెట్టారన్నారు. తదుపరి చీరాల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa