బంగ్లాదేశ్‌లో విద్యార్థుల నాయకత్వంలో జరిగిన రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం అక్కడ ప్రభుత్వాన్నే మార్చేసింది. అయితే, ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి ఆనాటి ప్రధాని షేక్ హసీనా ‘కాల్చివేత’ ఉత్తర్వులు ఇచ్చినట్టు తాజాగా బయటపడిన ఫోన్ రికార్డుల ద్వారా వెలుగులోకి వచ్చింది. గత ఏడాది జూలై 18న ఆమె ఈ ఆదేశాలు ఇచ్చారని ప్రముఖ మీడియా కథనం ప్రచురించింది. ఈ ఫోన్ రికార్డును ఆ వార్తా సంస్థ ధ్రువీకరించింది. హసీనాను పదవీచ్యుతురాలిని చేసిన అప్పటి ఉద్యమంలో 1400 మంది చనిపోయినట్టు ఐరాస తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa