AP: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఏఏఐబీ ఇచ్చిన ప్రాథమిక నివేదికపై కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. విమాన ప్రమాదంపై అప్పుడే ఒక నిర్ణయానికి రావొద్దన్నారు. ‘ప్రపంచంలోనే అత్యంత ప్రతిభ కలిగిన పైలట్లు, సిబ్బంది మన దగ్గర ఉన్నారు. ఈ రంగానికి వారే ప్రధాన వనరులు. వారి సంక్షేమం కోసం మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఇలాంటి సమయంలో ఎలాంటి నిర్ధరణకు రాకుండా తుది నివేదిక కోసం వేచిచూద్దాం’ అని మంత్రి అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa