సుహాస్ వంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. శుక్రవారం రాత్రి ఆయన వర్జీనియా రాష్ట్ర కాంగ్రెస్‌మెన్ సుహాస్ సుబ్రహ్మణ్యంతో సమావేశమయ్యారు. వాషింగ్టన్ డీసీలో జరిగిన ఓ కార్యక్రమంలో వీరు భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో శాప్ చైర్మన్ రవి అనిమిని కూడా పాల్గొన్నారు. దక్షిణ భారతీయ మూలాలు ఉన్న సుహాస్ అటార్నీగా పనిచేశారు.38ఏళ్ల వయస్సులోనే అమెరికా దిగువ సభ ‘దిగువ సభ’కు ఎన్నికయ్యారు. ఆయన తండ్రి సికింద్రాబాద్‌లో కొంతకాలం పనిచేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa