సిమ్ కార్డులో ఒక మూల కట్ చేసినట్టు ఉంటుంది. ఇలా చేయడంలో గల రహస్యం "పోకా-యోక్" డిజైన్. ఇది జపనీస్ సూత్రం. పొరపాట్లకు అవకాశం లేకుండా చేసే వినూత్న ఆవిష్కరణ. సిమ్ కార్డ్‌ను ఫోన్‌లో తప్పుగా పెట్టడం వల్ల చిప్ డ్యామేజ్ కాకుండా, సరైన రీతిలో పెట్టేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఫోన్ ట్రే కూడా ఆ డిజైన్‌కు అనుగుణంగా తయారవుతుంది. సిమ్ పరిమాణం మారినా ఈ కోణం మాత్రం కామన్. చిన్న మార్పుతో వినియోగదారుడికి భద్రత, సౌలభ్యం అందించే అద్భుత డిజైన్ ఇది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa