ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బౌలర్ మిచెల్ స్టార్క్ తన 100వ టెస్ట్ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ప్రపంచ రికార్డు సృష్టించాడు

sports |  Suryaa Desk  | Published : Tue, Jul 15, 2025, 04:39 PM

ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ తన 100వ టెస్ట్ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ప్రపంచ రికార్డు సృష్టించాడు. కింగ్స్‌టన్ సబీనా పార్క్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టార్క్ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 15 బంతుల్లోనే 5 వికెట్లు తీసి టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా ఐదు వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. గతంలో ఈ రికార్డు ఎర్నీ తోషాక్, స్టువర్ట్ బ్రాడ్, స్కాట్ బోలాండ్ (19 బంతులు) పేరిట ఉంది. ఈ టెస్టులో 204 పరుగుల లక్ష్యఛేదనతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన వెస్టిండీస్ 27 పరుగులకే కుప్పకూలింది. స్టార్క్ మొత్తం 6 వికెట్లు తీయగా, స్కాట్ బోలాండ్ హ్యాట్రిక్ సాధించడం విశేషం. ఆసీస్ బౌలర్ల ధాటికి విండీస్ ఇన్నింగ్స్ లో ఏడుగురు బ్యాట్స్ మెన్ డకౌట్ అయ్యారు. జస్టిన్ గ్రీవ్స్ చేసిన 11 పరుగులే ఆ జట్టులో అత్యధిక స్కోరు. ఇక ఇదే మ్యాచ్ తో స్టార్క్ టెస్టుల్లో 400 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన నాలుగో ఆసీస్ బౌలర్ గా నిలిచాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa