దత్తత పేరుతో ఓ బాలికను తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డ దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది. కృష్ణా జిల్లా విస్సన్నపేటకు చెందిన ఓ మహిళకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో రెండో కుమార్తె (17)ను దత్తత తీసుకునేందుకు కేశినేని రమేశ్ అనే వ్యక్తి ముందుకు వచ్చాడు. దత్తత పేరుతో తీసుకెళ్లి ఆ బాలికపై రమేశ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. రెండుసార్లు గర్భం దాల్చగా అబార్షన్ చేయించాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa