చైనాలో జరిగే షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ పాల్గొననున్నట్టు తాజాగా జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. లద్దాఖ్ సరిహద్దుల్లో సైనికుల మధ్య ఘర్షణ తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ సంఘటన తర్వాత మోదీ చైనా వెళ్లలేదు. అయితే తాజాగా భారత్-చైనా సంబంధాలు మెరుగుపడుతుండటంతో, మోదీ చైనాలో పర్యటించి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa