లార్డ్స్‌లో మూడో టెస్ట్‌లో భారత్‌పై 22 పరుగుల తేడాతో గెలిచిన ఇంగ్లండ్‌కు ఊహించని షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా మ్యాచ్ ఫీజులో 10% జరిమానా ఎదుర్కొవడంతో పాటు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్(WTC) టేబుల్‌లో 2 పాయింట్లు కోల్పోయింది. దీంతో ఇంగ్లండ్ పాయింట్ల శాతం 66.67 నుంచి 61.11కు పడిపోయి మూడో స్థానానికి చేరింది. WTC రూల్స్‌లోని ఆర్టికల్ 16.11.2 ప్రకారం జరిమానాతో పాటు పాయింట్ల కోత విధించబడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa