జార్ఖండ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రైలు ఢీకొని మూడు ఏనుగులు ప్రాణాలు కోల్పోయాయి. ఖరగ్‌పూర్ డివిజన్‌లోని సర్దిహా-జార్గ్రామ్ సెక్షన్‌లో గురువారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. మృతుల్లో ఒక పెద్ద ఏనుగు, రెండు పిల్ల ఏనుగులు ఉన్నాయి. చనిపోయిన ఏనుగుల మృతదేహాలను సంఘటనా స్థలం నుంచి తొలగించారు. రైల్వే రాకపోకలు నిలిపివేసి, ఉదయం 6:15కి అప్ లైన్, 7:30కి డౌన్ లైన్ ను అధికారులు పునరుద్ధరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa