ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.20వేల లోపు బెస్ట్ 5 కెమెరా స్మార్ట్‌ఫోన్స్

Technology |  Suryaa Desk  | Published : Fri, Jul 18, 2025, 01:51 PM

ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ Flipkartలో రూ.20,000 లోపు అద్భుతమైన కెమెరా స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. ఈ ఫోన్లు మెరుగైన కెమెరా పనితీరుతో పాటు మంచి ఓవరాల్ స్పెసిఫికేషన్లను అందిస్తాయి.అందులో Motorola G85 5G, Samsung Galaxy F36 5G, POCO M6 Plus 5G, ealme P3x 5G, Tecno Pova 7 5G / Tecno Pova 7 Pro 5G ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు వీటి ధరలు, కెమెరా గురించి తెలుసుకుందాం.


Motorola G85 5G
Motorola G85 5G స్మార్ట్ఫోన్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర రూ.15,999గా ఉంది. ఇది 50MP ప్రధాన కెమెరా (OISతో), 8MP అల్ట్రా-వైడ్ లెన్స్తో వెనుకవైపు ఉంది. అలాగే 32MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఇది 6.67 inch Full HD+ Displayను కలిగి ఉంది. దీనిపై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి.


Samsung Galaxy F36 5G (త్వరలో విడుదల)
Samsung Galaxy F36 5G స్మార్ట్ఫోన్ త్వరలో విడుదల కానుంది. ఇది 50MP OIS కెమెరా ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ ఫోన్ 6.7 అంగుళాల AMOLED డిస్ప్లే, Exynos 1380 ప్రాసెసర్, 5000mAh బ్యాటరీతో వస్తుంది. అధికారికంగా విడుదల కానప్పటికీ.. ఇది రూ.20,000 లోపే ఉంటుందని అంచనా.


POCO M6 Plus 5G
POCO M6 Plus 5G స్మార్ట్ఫోన్ హైక్వాలిటీ బ్యాక్ కెమెరాతో వస్తుంది. ఇది 108MP ప్రధాన కెమెరా (OIS తో), 2MP డెప్త్ సెన్సార్తో పాటు 13MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. దీని 6 GB RAM + 128 GB స్టోరేజ్ ధర రూ.10,080గా కంపెనీ నిర్ణయించింది. ఇది 6.79-అంగుళాల Full HD+ డిస్ప్లే, 5030 mAh Batteryతో వస్తుంది.


realme P3x 5G
realme P3x 5G స్మార్ట్ఫోన్ రూ.12,999 ధరను కలిగి ఉంది. దీని 6 GB RAM + 128 GB స్టోరేజ్ వేరియంట్ వెనుకవైపు 50MP ప్రధాన కెమెరా ఉంది. ముందువైపు 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఇది 6000mAh పెద్ద బ్యాటరీ, Full HD డిస్ప్లేతో వస్తుంది.


Tecno Pova 7 5G / Tecno Pova 7 Pro 5G
Tecno Pova 7 5Gలో 50MP + AI కెమెరా అందించారు. అదే సమయంలో Pova 7 Proలో 64MP + 8MP కెమెరాలు ఉన్నాయి. అలాగే 6000mAh బ్యాటరీ, Full HD+ డిస్ప్లేలు ఆకర్షిస్తున్నాయి. Pova 7 ధర సుమారు రూ.14,000 - రూ15,000 ఉండగా.. Pova 7 Pro ధర సుమారు రూ.18,000 - రూ.19,000 వరకు ఉంటుంది.కొనుగోలు చేసే ముందు Flipkartలో యూజర్ రివ్యూలు, ముఖ్యంగా కెమెరా పనితీరుకు సంబంధించినవి తప్పకుండా చూసి కొనుక్కుంటే మంచిది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa