అమరవీరుల వారోత్సవాల నేపథ్యంలో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురు దెబ్బతగిలింది.ఛత్తీస్‌గఢ్లోని నారాయణపూర్ జిల్లా అబూజ్‌మడ్ అడవుల్లో శుక్రవారం సాయంత్రం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలి నుంచి ఒక ఏకే-47, మరో ఎస్‌ఎల్‌ఆర్ తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు నారాయణపూర్ పోలీసులు తెలిపారు. అబూజ్‌మడ్ అడవుల్లో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో.. డీఆర్‌జీ, ఎస్టీఎఫ్, కోబ్రా బలగాలు కూబింగ్ చేపట్టాయని వివరించారు. ఈ క్రమంలో మావోయిస్టులు, బలగాల మధ్య కాల్పులు జరిపాయని పేర్కొన్నారు. నక్సల్స్ వైపు కాల్పులు నిలిచిపోయాక.. పరిశీలించగా.. ఆరు మృతదేహాలు లభ్యమైనట్లు వెల్లడించారు. ఒక ఏకే-47, మరో ఎస్‌ఎల్‌ఆర్ తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. కూంబింగ్ కొనసాగుతోందని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa