ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారికి కూడా తల్లికి వందనం డబ్బులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 19, 2025, 04:42 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం డబ్బుల్ని విడుదల చేసింది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి.. ఒక్కొక్కరికి రూ.13వేల చొప్పున అకౌంట్‌లలో జమ చేసింది. జూన్ 12న తొలి విడత.. ఈ నెల 10న రెండో విడతగా డబ్బులు విడుదల చేశారు. తాజాగా తల్లికి వందనం పథకానికి సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. 'తల్లికి వందనం పథకానికి సంబంధించి గ్రీవెన్స్ ద్వారా దరఖాస్తు చేసుకున్నవారికి 'Remarks'లో 'Eligible And To Be Paid' అని ఉన్న వారికి అమౌంట్స్ నిన్న క్రెడిట్ అయినవి. NPCI Inactive గా ఉండడం వలన 'Payments Fail' అయిన వారికి 'Payments Process' చేయబడినవి. వారికి కూడా అమౌంట్స్ క్రెడిట్ అవుతూ ఉన్నవి. పై వాటికి సంబంధించిన 'Payment Status' లు 'NBM' పోర్టల్ లో సోమవారం సాయంత్రానికి అప్డేట్ అవుతాయి' అని తెలిపారు.


ఈ మేరకు 'తల్లికి వందనం పథకం స్టేటస్ చెక్ చేసుకునేందుకు ప్రభుత్వ వెబ్ సైట్ https://gsws-nbm.ap.gov.in/NBM/Home/Main ద్వారా చూసుకోవాలి. ఆ వెబ్‌సైట్‌లో ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ (Track Application Status) ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత (Mother/Father, Guardian) తల్లి/తండ్రి/సంరక్షకులు ఆప్షన్‌ ఉంటుంది. అక్కడ తల్లి ఆప్షన్ (Mother Option) సెలక్ట్ చేసుకుని.. తల్లి ఆధార్ ప్లేస్‌లో విద్యార్థి ఆధార్ నంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి. అప్పుడు విద్యార్థికి డబ్బులు జమ అయ్యోయో లేదో ట్రాక్ అప్లికేషన్‌లో పేమెంట్ స్టేటస్ డిస్‌ప్లే అవుతుంది' అని తెలిపారు.


తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తిక్కవరం ఉన్నత పాఠశాలలో దాదాపు 300 మంది విద్యార్థులకు 'తల్లికి వందనం' పథకం డబ్బులు రాలేదు. దీనితో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఉపాధ్యాయుల సహాయంతో సచివాలయాల్లో ఫిర్యాదు చేశారు. మొదటి విడతలో డబ్బులు వస్తాయని ఎదురు చూశారు. రెండవ విడతలో కూడా డబ్బులు రాకపోవడంతో నిరాశలో ఉన్నారు. విద్యార్థుల తల్లుల ఆధార్ కార్డులలో 12 అంకెల బదులు 9 అని నమోదు కావడమే దీనికి కారణమని హెడ్‌మాస్టర్ చెబుతున్నారు. అయితే అందరికీ న్యాయం జరిగేలా తమవంతు ప్రయత్నం చేస్తున్నాము అన్నారు. ఆధార్ కార్డులలో తప్పుగా నమోదైన సంఖ్యలను సరిచేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని..త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు.


తిరుపతి జిల్లాలో మాత్రమే కాదు ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఓ ప్రైవేట్ స్కూల్‌లో 172మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకం డబ్బులు రాలేదు. స్కూల్‌లో ఉద్యోగులు చేసిన తప్పుకు విద్యార్థులు బలయ్యారు.. వెంటనే వారి తల్లిదండ్రులు స్కూల్ దగ్గరకు వెళ్లి ప్రశ్నించారు. వెంటనే యాజమాన్యం స్పందించింది.. ఈ 172మంది విద్యార్థుల్లో అర్హత ఉన్న విద్యార్థుల పేర్లను మళ్లీ తల్లికి వందనం పథకం అర్హుల జాబితాలో వచ్చేలా ప్రయత్నాలు చేస్తామని.. ఒకవేళ కుదరకపోతే కనుక స్కూల్ ఫీజును తగ్గిస్తామని హామీ ఇచ్చారు.. దీంతో తల్లిదండ్రులు శాంతించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa