మీకు షార్ట్ ఫిల్మ్ చేయడంలో అనుభవం ఉందా.. వీక్షకులను ఆకట్టుకునేలా షార్ట్ ఫిల్మ్స్ చేయటంలో మీరు సిద్ధహస్తులా.. చెప్పాల్సి్న కంటెంట్‌ను సూటిగా, సుత్తి లేకుండా చెప్పటంలో మీకు మీరే సాటి అని అనుకుంటున్నారా.. అయితే అలాంటి వారికో అద్భుత అవకాశం. కేవలం 4 నిమిషాలు వ్యవధి ఉండే షార్ట్ ఫిల్మ్ తీయండి.. లక్షాధికారి కండి..ఆంధ్రప్రదేశ్ సారస్వత పరిషత్ ఈ అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. తెలుగు భాషాభివృద్ధి ఇతివృత్తంగా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ (అంతర్జాతీయ లఘు చిత్ర పోటీలు) నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సారస్వత పరిషత్ ప్రకటించింది. తెలుగు భాష - చారిత్రక వైభవం, ఆంధ్ర సారస్వత వైభవం, తెలుగు భాషా అభివృద్ధి, తెలుగు వైభవం, తెలుగు భాషా పరిరక్షణ ప్రచారం వంటి ఇతివృత్తాల నేపథ్యంలో ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ ప్రకటించారు.
ఔత్సాహికుల నుంచి వచ్చిన లఘు చిత్రాలను సెప్టెంబర్ 14వ తేదీ గుంటూరులోని భారతీయ విద్యాభవన్‌లో ప్రదర్శిస్తారు. ఔత్సాహికులు కనీసం నాలుగు నిమిషాలు అలాగే ఐదు నిమిషాలకు మించకుండా షార్ట్ ఫిల్మ్ తీసి పంపించాల్సి ఉంటుంది. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ పోటీకి అర్హులే. అయితే షార్ట్ ఫిల్మ్‌లో రాజకీయ పార్టీలు, రెచ్చగొట్టే అంశాలు, అలాగే జాతీయ ఐక్యతకు భంగం కలిగించే విషయాలు ఉంటే అనుమతి ఉండదు. అయితే ఒకసారి దరఖాస్తు చేసుకుంటే మళ్లీ వెనక్కి తీసుకునే అవకాశం ఉండదని ఆంధ్ర సారస్వత పరిషత్ వెల్లడించింది. ఆగస్ట్ 14వ తేదీలోగా ఆసక్తికలిగిన వారు తమ ఎంట్రీలు పంపించాలని కోరింది.
వీట్రాన్స్‌ఫర్ సాయంతో aspshortfilmcontest@gmail.com వెబ్ సైట్‌కు తమ ఎంట్రీలను/ షార్ట్ ఫిల్మ్ పంపించాలని ఆంధ్ర సారస్వత పరిషత్ సూచించింది. అలాగే సబ్మిట్ చేయడానికి టెక్నికల్ టీమ్ మెంబర్ల నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ తప్పనిసరి అని పేర్కొంది. ఆసక్తికలిగిన వారు ఒక్కొక్కరు రెండేసి ఎంట్రీలు చేసుకోవచ్చని సూచించింది. డాక్యమెంటరీలతో పాటుగా నేరటివ్ ఫిల్మ్‌లను కూడా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ కోసం అనుమతిస్తారు. ఈ షార్ట్ ఫిల్మ్స్ భవిష్యత్తు తరాలు తెలుగుభాషను పరిరక్షణను ప్రోత్సహించేలా ఉండాలని ఆంధ్ర సారస్వత పరిషత్ సూచించింది.
ఇక ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్‌లో ప్రథమ స్థానంలో నిలిచిన వారికి రూ.లక్ష, రెండో స్థానంలో నిలిచిన వారికి రూ.75 వేలు, మూడో స్థానంలో నిలిచినవారికి రూ.50 వేలు అందిస్తారు. వీటితో పాటుగా మరో ముగ్గురికి కన్సొలేషన్ బహుమతికి కింద రూ.10,116లు అందిస్తారు. అలాగే ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ రచయిత, ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డులు అందిస్తామని ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రకటించింది. 2026 జనవరి 3వ తేదీన గుంటూరులో జరిగే మూడవ అంతర్జాతీయ తెలుగు మహాసభలలో విజేతలకు పురస్కారాలు, అవార్డులు అందజేయనున్నారు. అలాగే వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్‌లో ఈ లఘు చిత్రాలను ప్రదర్శిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa