ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరి ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయంలోకి వెళ్లిన ఆయన ముందు గా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వా త గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వాదం అందించగా, అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు. సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa