విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం రెండు కన్సల్టెన్సీలతో ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి నారాయణ సమక్షంలో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్, సిస్టా, టిప్సా కన్సల్టెన్సీల ప్రతినిధులు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. విశాఖ, విజయవాడ మెట్రో మొదటి దశ పనుల్ని మూడేళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. విశాఖ మెట్రో ఫేజ్ 1లో భాగంగా 46.23 కి.మీ పనులకు టెండర్లు పిలిచినట్లు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa