AP: ఆయుష్ విభాగంలో 358 ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఆయుష్ సేవలను విస్తృతంగా అందించేందుకు ఈ నియామకాలు చేపడుతున్నట్టు తెలిపారు. మొత్తం 358 పోస్టుల్లో 71 డాక్టర్లు, 26 జిల్లాల్లో ప్రోగ్రామ్ మేనేజర్లు, సహాయకులు, అలాగే 90 మంది పంచకర్మ థెరపిస్టులు ఉన్నారన్నారు. నియామక ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa