డ్రోన్ నుండి క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించినట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఈ పరీక్ష ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో గల నేషనల్ ఓపెన్ ఏరియా రేంజి లో జరిగింది. ఈ ప్రయోగానికి సంబంధించిన ఫొటోను ఆయన 'ఎక్స్' వేదికగా పంచుకున్నారు.డీఆర్డీఓ, ఈ క్షిపణి అభివృద్ధి మరియు తయారీలో భాగస్వాములైన ఎంఎస్ఎంఈలు, స్టార్టప్స్‌లను రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. సంక్లిష్టమైన సాంకేతికతను అర్థం చేసుకోవడంతో పాటు ఉత్పత్తి చేయగల సామర్థ్యం భారతదేశానికి ఉందని ఈ పరీక్ష నిరూపించిందని ఆయన పేర్కొన్నారు.దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ క్షిపణిని యూఏవీ లాంచ్‌డ్ ప్రెసిషన్ గైడెడ్ మిసైల-వీ3గా వ్యవహరిస్తున్నారు. అయితే, దీని సాంకేతిక వివరాలను వెల్లడించలేదు. గతంలో డీఆర్డీవో పత్రాలు, బహిరంగ సమాచారం ప్రకారం గతంలో పరీక్షించిన యూఎల్‌పీజీఎం-వీ2 వేదికపైనే దీనిని అభివృద్ధి చేశారు.కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పాలకొలను సమీపంలోని డీఆర్డీవోకు చెందిన ఎన్ఓఏఆర్ పరీక్ష కేంద్రాన్ని దీని కోసం ఎంచుకున్నారు. గతంలో కూడా ఇక్కడ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ వ్యవస్థను పరీక్షించేందుకు ఇదే వేదికను ఉపయోగించారు. ఈ ఆయుధం ఫిక్స్‌డ్‌వింగ్ మానవరహిత విమానాలను కూల్చివేయడానికి ఉపయోగిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa