ఆస్ట్రేలియాలో ఇటీవల ఓ భారత విద్యార్థిపై దాడి ఘటన మరవకముందే మరో భారత విద్యార్థిపై కత్తితో దాడి జరిగింది. మెల్‌బోర్న్‌లో ఉంటున్న భారత విద్యార్థి సౌరభ్ ఆనంద్ ఇటీవల ఓ ఫార్మసీ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో దుండగులు అతడిపై కత్తితో దాడి చేశారు. అతడు దాడిని తీవ్రంగా ప్రతిఘటించాడు. ఈ ఘటనలో సౌరభ్ మెడ, తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. చేయి తెగిపడింది. తెగిన చేయిని వైద్యులు అతికించారు. పోలీసులు ఐదుగురిలో నలుగురిని అరెస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa