పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు పనులు ఇంకా ప్రారంభంకాలేదని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈమేరకు తమకు తెలియజేసిందని కేంద్రం వెల్లడించింది. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై సోమవారం రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ అనిల్‌కుమార్ అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర జలశక్తి సహాయ మంత్రి రాజ్‌భూషణ్ చౌధరి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. సాంకేతిక, ఆర్థిక పరిశీలన కోసం ఆ ప్రాజెక్టు ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదికను ఏపీ ప్రభుత్వం తమ మంత్రిత్వ శాఖలోని కేంద్ర జలసంఘానికి అందజేసిందని తెలిపారు. ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన ఆందోళనలను కేంద్రప్రభుత్వం స్వీకరించిందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa