దగ్గరి నుంచి సుదూరం వరకు లక్ష్యాలను ఛేదించే ‘ప్రళయ్’ క్షిపణి పరీక్షలను డీఆర్‌డీవో విజయవంతంగా ప్రయోగించింది. అత్యంత కచ్చితత్వంతో ఈ క్షిపణి లక్ష్యాన్ని ఛేదించింనట్లు రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (డిఆర్‌డివో) వెల్లడించింది. జులై 28, 29 తేదీలలో ‘ప్రళయ్’ క్షిపణి పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. ఉపరితలం నుంచి ఉపరితలంపై స్వల్ప, సుదూర లక్ష్యాలను ఛేదించేందుకు దీన్ని రూపొందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa