పీఎం కిసాన్ యోజన 20వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 2న రైతుల అకౌంట్లలో జమ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం కింద కేంద్రం ప్రతి ఏడాది రూ. 6 వేలను మూడు విడతల్లో(రూ. 2000) రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ స్కీమ్ లబ్దిదారుడి జాబితాలో మీ పేరు ఉందో తెలుసుకోవాలంటే pmkisan.gov.in వెబ్ సైట్ లో తనిఖీ చేసుకోవచ్చు. కాగా e-KYC, అలాగే బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ లింక్ చేయడం తప్పనిసరి అని అధికారులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa