చత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతంలో కాల్పులు కలకలం రేపాయి. మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ఈ నెల 28 నుంచి జరుగుతుండగా, భద్రతా బలగాలు అడవులను జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో మావోలు భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన బలగాలు, మావోయిస్టులపై ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఎన్ కౌంటర్ లో ఒక మావోయిస్టు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa