శ్రీవాణి టికెట్లపై శ్రీవారి దర్శనం విధానంలో టీటీడీ మార్పులు చేసింది. ప్రస్తుతం శ్రీవాణి టికెట్‌పై దర్శనానికి మూడు రోజులు పడుతుండగా.. ఇకపై ఏ రోజు టికెట్ తీసుకుంటే ఆరోజే దర్శనానికి టీటీడీ వీలు కల్పించనున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 1 నుంచి 15వ తేదీ వరకు ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. ఉదయం శ్రీవాణి టికెట్ పొందిన భక్తులు.. అదే రోజు సాయంత్రం 4.30 గంటలకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-1 వద్ద రిపోర్టు చేయాల్సి ఉంటుంది. నవంబర్ 1వ తేదీ నుంచి దీన్ని పూర్తిస్థాయిలో అమలు చేయనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa