ఇటీవలి కాలంలో అనేక బ్యాంకులు, ఫిన్టెక్ సంస్థలు “లైఫ్‌టైం ఫ్రీ” లేదా “నో యానువల్ ఫీజు” అంటూ క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. కానీ, నిజంగా అవి పూర్తిగా ఉచితమా అన్న సందేహం వినియోగదారుల్లో తలెత్తుతోంది. అసలు విషయం ఏమిటంటే, ఈ కార్డుల వెనక ఓదార్పులా కనిపించే పైకి కనిపించని ఛార్జీలు దాగివుంటాయి.అధిక వడ్డీ రేట్లువార్షిక రుసుములు లేనప్పటికీ, ఈ కార్డులు అధిక వడ్డీ రేట్లను కలిగి ఉండవచ్చు. తద్వారా మీ కార్డు వాడకం మరింత ఖరీదైనదిగా మారుతుంది. 'లైఫ్ టైమ్ ఫ్రీ' క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసేటప్పుడు దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి.విదేశీ లావాదేవీ మార్పిడి రుసుమువార్షిక రుసుము లేనప్పటికీ, ఈ కార్డులకు ఫారెక్స్ మార్క్-అప్ ఫీజు (2 నుండి 4 శాతం మధ్య) ఉండవచ్చు. ఇది యూఎస్ డాలర్ లేదా బ్రిటిష్ పౌండ్లువంటివిదేశీ కరెన్సీలో ఏదైనాఉత్పత్తి లేదా సర్వీస్కోసం చెల్లింపు సమయంలో వసూలు చేస్తారు. . 'లైఫ్ టైమ్ ఫ్రీ' క్రెడిట్ కార్డు పొందే సమయంలో ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.
*ఉదాహరణకు:
లేట్ పేమెంట్ ఫీజు
ఫైనాన్షియల్ చార్జీలు (ఇంట్రెస్ట్)
ఇఎంఐ ప్రాసెసింగ్ ఫీజులు
ఫారెక్స్ మార్జిన్ ఛార్జీలు (విదేశాల్లో లావాదేవీలపై)
ఈ వివరాలు సాధారణంగా చిన్న అక్షరాలతో “టర్మ్స్ & కండిషన్స్” లో ఉంటాయి. వినియోగదారులు అవి చదవకుండా ఒప్పుకోవడంతో, తర్వాత అనుకోకుండా భారీ చార్జీలు పడతాయి.
*ముఖ్య సూచన: క్రెడిట్ కార్డ్ తీసుకునే ముందు, వార్షిక ఫీజు, హిడెన్ ఛార్జీలు, రివార్డ్ పాలసీ, డ్యూయ్ డేట్ పాలసీ వంటి అంశాలను బాగా పరిశీలించడం అత్యవసరం. "ఫ్రీ" అనే మాట నమ్మడం కాదు, ఏం "ఫ్రీ"గా వస్తుందో పూర్తిగా తెలుసుకోవాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa