వేటపాలెం మండలం దేశాయిపేట గ్రామం రాంనగర్ నందు నిర్వహించిన "సుపరిపాలనలో-తొలి అడుగు" కార్యక్రమంలో చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య శనివారం పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు వివరిస్తూ, కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాల లబ్దిదారులతో ప్రత్యేకంగా సమావేశమై, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరుపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నాను.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa