అమెరికాలో వివాహం ద్వారా గ్రీన్ కార్డ్ పొందాలనుకుంటున్న వారికి కఠిన సవాళ్లు ఎదురుకానున్నాయి. యూఎస్‌సీఐఎస్ కొత్త మార్గదర్శకాల్లో, ప్రతి జంట తప్పనిసరిగా వ్యక్తిగత ఇంటర్వ్యూకు హాజరుకావాలి. తమ బంధం నిజమని నిరూపించే పక్కా ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. మోసపూరిత వివాహాలను అడ్డుకునేందుకు ఈ మార్పులు తీసుకొచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. నిబంధనలు నెరవేర్చకపోతే దేశ బహిష్కరణకు నోటీసులు జారీ చేసే అధికారం అధికారులకు ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa