గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) స్టాండింగ్ కమిటీ ఎన్నికలో కూటమి ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. 50 ఓట్లతో వైసీపీ కార్పొరేటర్ పద్మ రెడ్డి విజయం సాధించారు. బుధవారం జరిగిన ఈ ఎన్నికలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. కూటమి కార్పొరేటర్లు వైసీపీకి ఓటు వేశారు. పార్టీ ఫిరాయింపు కార్పొరేటర్లను ఓటింగ్‌కు వాడుకున్నా కూడా కూటమి ప్రభుత్వానికి భంగపాటు తప్పలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa