బెంగళూరు:
బెంగళూరులో ఓ హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. నగరంలో ఓ వ్యక్తి శరీర భాగాలు వివిధ ప్రాంతాల్లో కనిపించడం స్థానికులను కలచివేసింది. ఈ ఘటన పోలీసులను కూడా షాక్కు గురిచేసింది. మొత్తం ఐదు వేర్వేరు ప్రాంతాల్లో భాగాలు లభ్యమవడం మిస్టరీగా మారింది.
కుక్క నోట్లో చేయి:
ఈ మర్మమైన సంఘటన బహిర్గతమవడానికి కారణం ఓ కుక్క. అది నోట్లో మానవ చేతిని పట్టుకుని రోడ్డుపై వెళ్తుండగా ఓ వ్యక్తి గమనించాడు. అతను వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో, వారు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
మూడు కిలోమీటర్ల పరిధిలో శరీర భాగాలు:
దర్యాప్తులో భాగంగా, మూడు కిలోమీటర్ల పరిధిలో వివిధ ప్రదేశాల్లో మానవ శరీర భాగాలను పోలీసులు గుర్తించారు. చేతులు, కాళ్లు, ఇతర అవయవాలను వేర్వేరు ప్రాంతాల్లో నిపుణులు సేకరించారు. ఈ భాగాలను పరిశీలించడానికి ఫోరెన్సిక్ బృందాన్ని రంగంలోకి దించారు.
మృతుడి గుర్తింపు యత్నాలు:
ఇప్పటికే ఈ ఘటన స్థానికంగా గందరగోళం రేపుతోంది. మృతుడెవరో ఇంకా స్పష్టత రాలేదు. పోలీసు శాఖ స్థానికులను విచారిస్తూ, ఇటీవల గల్లంతయిన వారిపై ఆధారాలు సేకరిస్తోంది. ఇది హత్యా? లేక వేరే ఏదైనా కారణమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa