భారత సరిహద్దు సమీపంలో చైనా భారీ రైల్వే లైన్ నిర్మించేందుకు పనులు చేపట్టనున్నట్లు అక్కడి స్థానిక మీడియా ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ తెలిపింది. దీని కోసం రూ.1.15 లక్షల కోట్లు కేటాయించినట్లు సమాచారం. టిబెట్‌ను షిన్‌జాంగ్ ప్రావిన్స్‌తో కలుపుతూ నిర్మించనున్న ఈ రైల్వే మార్గంలోని కొన్ని భాగాలు వాస్తవాధీన రేఖ సమీపం నుంచి వెళ్లనున్నాయి. భారత్ సరిహద్దు ప్రాంతంలో ఈ ప్రాజెక్టుకు రక్షణపరమైన ప్రాముఖ్యం ఏర్పడనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa