AP: రాష్ట్రంలో శుక్రవారం నుంచి మహిళలకు ఉచిత బస్ స్కీం ప్రారంభం కానుంది. స్త్రీ శక్తి పేరుతో అమలు చేసే ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఆ తర్వాతే జీరో ఫేర్ టికెట్ల జారీ ప్రారంభమవుతుంది. విజయవాడ PN బస్టాండ్‌లో సా.5 గంటల సమయంలో సీఎం ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. అయితే నాన్‌స్టాప్, ఇతర రాష్ట్రాలకు వెళ్లే, పర్యాటక, సూపర్ లగ్జరీ, సప్తగిరి(తిరుమల), ఆల్ట్రా డీలక్స్, స్టార్ లైనర్, AC బస్సుల్లో స్కీమ్ వర్తించదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa