యర్రావారిపాలెం మండలంలోని తలకోన సిద్ధేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి సోమవారం భూమిపూజ జరిగింది. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ బి. ఆర్. నాయుడు, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, బోర్డు సభ్యులు హాజరయ్యారు. టీటీడీ నిధులతో రూ. 18 కోట్ల వ్యయంతో ఆలయ పునర్నిర్మాణం, పుష్కరిణి నిర్మాణం చేపట్టనున్నారు. తలకోన ప్రాంతం ఆధ్యాత్మికంగా మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa