ముంబయిలో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా పలు విమానాలను దారి మళ్లించారు. ప్రతికూల వాతావరణం కారణంగా దాదాపు 250కి పైగా విమాన సర్వీసులపై ప్రభావం పడినట్లు అధికారులు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి 9.50 గంటల ప్రాంతంలో 8 విమానాలను దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. వర్షాలకు రోడ్లు, రైల్వే లైన్లు దిగువ ప్రాంతాలు నీటితో నిండిపోవడంతో భారత వాతావరణ శాఖ ఐఎండీ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa