ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అతిపెద్ద సైబర్ సెక్యూరిటీ సదస్సు.. ట్రైనింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోండి

national |  Suryaa Desk  | Published : Fri, Aug 22, 2025, 08:45 PM

సైబర్ భద్రతపై దేశంలోనే అతిపెద్ద, అత్యంత ప్రతిష్ఠాత్మక సదస్సుకు కేరళలోని కొచ్చి నగరం ఆతిథ్యం ఇస్తోంది. అక్టోబరు 10, 11 తేదీల్లో రెండు రోజుల పాటు కొచ్చి గ్రాండ్ హయత్‌లో జరిగే కొకొన్ 2025 సదస్సుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఈ సదస్సుకు ముందు అక్టోబర్ 7, 8, 9 తేదీలలో మూడు రోజుల పాటు ప్రపంచస్థాయి సైబర్ భద్రతా నిపుణులతో ప్రత్యేకమైన శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అధునాతన సైబర్ భద్రత పద్ధతులకు ఆచరణాత్మక అవగాహనను అందించడమే ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశం.


ఏఐ- ఆధారిత సైబర్ దాడులు, రాన్‌‌సమ్‌వేర్ మోసాలు, ప్రభుత్వాల ఆద్వర్యంలో జరిగే హ్యాకింగ్, డీప్‌ఫేక్ ఆధారిత తప్పుడు సమాచారం వ్యాప్తి నేపథ్యంలో c0c0n 2025 సైబర్ భద్రత, డిజిటల్ భవిష్యత్తుపై చర్చించడానికి ప్రపంచ నాయకులను ఒకచోట చేర్చుతుంది.


రాన్‌సమ్‌వేర్ ఎవల్యూషన్: వ్యక్తిగత దాడుల నుంచి ప్రభుత్వాలు, ఆసుపత్రులు, కార్పొరేషన్లను లక్ష్యంగా చేసుకున్న భారీ స్థాయి సైబర్ దాడులను అడ్డుకోవడం.


క్వాంటమ్ కంప్యూటింగ్ ముప్పు : ఎన్‌క్రిప్షన్ ప్రమాణాలను ధ్వంసం చేస్తోన్న క్వాంటమ్ డిస్క్రిప్షన్‌తో భవిష్యత్తుకు సిద్ధం కావడం.


డీప్‌ఫేక్‌లు, ఇన్ఫర్మేషన్ వార్ : రాజకీయాలు, ఆర్థిక రంగం, సామాజిక స్థిరత్వంపై ప్రభావం చూపే ఏఐ సృష్టించిన తప్పుడు సమాచార ముప్పులను ఎదుర్కోవడం.


క్లౌడ్, ఐఓటీ భద్రత: 5G, కనెక్టెడ్ డివైజ్‌లు, ఇండస్ట్రియల్ ఐఓటీ, స్మార్ట్ సిటీలలో ఉన్న బలహీనతలను పరిష్కరించడం.


సప్లై చైన్‌పై దాడులు: కీలక మౌలిక వసతులలో చొరబడేందుకు హ్యాకర్లు చేసిన దాడుల నుంచి పాఠాలు నేర్చుకోవడం.


డిజిటల్ ఫోరెన్సిక్స్, దాడులపై ప్రతిస్పందన: : దాడులను వేగంగా గుర్తించడం, మూలాలను కనుగొనడం, చట్టపరమైన చర్యలు అమలు అవసరం మొదలైనవి.


వివిధ రంగాల భాగస్వామ్యం


ఈ సమావేశం అత్యంత కీలక రంగాలు ఎదుర్కొనే సైబర్ ముప్పు నివారణ వ్యూహాలను వివరించనుంది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫిన్‌టెక్ - ఆన్‌లైన్ మోసాలు, డిజిటల్ చెల్లింపు దాడులను ఎదుర్కోవడం; హెల్త్‌కేర్, ఫార్మా‌లో రోగుల డేటా, క్లినికల్ పరిశోధనలను రక్షించడం; విద్య, పరిశోధన సంస్థల్లో మేధో సంపత్తిని రక్షించడం; తయారీ, ఆటోమొబైల్స్, చమురు, గ్యాస్ రంగాలను సైబర్ విధ్వంసం నుంచి పారిశ్రామిక నియంత్రణ వ్యవస్థలను రక్షించడం; రిటైల్, ఇ-కామర్స్, మీడియాలో గుర్తింపు చోరీ, బ్రాండ్ పేరుతో జరిగే మోసాలను ఎదుర్కోవడం; ప్రభుత్వ విభాగాలలో ప్రభుత్వాల మద్దతుతో జరిగే సైబర్ యుద్ధానికి వ్యతిరేకంగా స్థితిస్థాపకతను నిర్ధారించడం.


అంతర్జాతీయ భాగస్వామ్యం


ఈ సదస్సులో ప్రపంచస్థాయి సైబర్ భద్రత నిపుణులు, వైట్-హ్యాట్ హ్యాకర్లు, వివిధ దేశాల దర్యాప్తు సంస్థల ఉన్నతాధికారులు.. అధునాత సాంకేతికత, దాడుల కేస్ స్టడీలు, సంయుక్త భద్రత యంత్రాంగాలపై తమ అనుభవాలను పంచుకోనున్నారు.


2008లో తొలిసారిగా నాటి కొచ్చి సిటీ పోలీస్ కమిషనర్‌ ఆధ్వర్యంలో ప్రారంభమైన కొకొన్ (c0c0n) నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సైబర్‌ భద్రత వేదికగా ఎదిగింది. గత 18 ఏళ్లలో ఇది సైబర్‌డోమ్, డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబ్, చిన్నారులపై లైంగిక దాడులను నిరోధించే సెంటర్ వంటి ఆవిష్కరణలకు దారితీసి, దేశంలో చట్ట అమలు - పరిశ్రమల భాగస్వామ్యంకి కొత్త ప్రమాణాలను నెలకొల్పింది.


కొకొన్ (c0c0n) 2025 ను ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ రిసెర్చ్ అసోసియేషన్ (ISRA), కేరళ పోలీసులు సంయుక్తంగా ప్రపంచస్థాయి సైబర్‌ సెక్యూరిటీ సంస్థల సహకారంతో నిర్వహిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa