వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వినాయక చవితి విశిష్టతను వివరించారు.హైందవ పండుగలలో కొన్నింటిని కొన్ని ప్రాంతాల్లోనే నిర్వహించుకుంటారని, కానీ వినాయక చవితిని మాత్రం ప్రపంచంలోని హిందువులంతా ఒక్కటిగా జరుపుకుంటారని ఆయన అన్నారు. అంతటి విశిష్టమైన ఈ పండుగ సందర్భంగా గణనాథుని భక్తులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.గణాలకు అధిపతి లంబోదరుడని, ప్రజలు తలపెట్టే అన్ని శుభ కార్యక్రమాలకు విఘ్నాలు కలగకుండా చూడాలని ఆ పార్వతీ తనయుడిని వేడుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. ఎప్పటిలాగే ఒక విన్నపం చేస్తూ మట్టి వినాయకుడిని పూజించాలని, పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa