బిహార్‌లో కాంగ్రెస్ నిర్వహించిన ఓటర్ అధికార్ యాత్రలో ప్రధాని మోదీ, ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మొహమ్మద్ రిజ్వి అలియాస్ రాజా అనే వ్యక్తి ఈ వ్యాఖ్యలు చేయగా.. బీజేపీ నాయకులు ఈ ఘటనపై పట్నా కొత్వాలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీడియోలు సైతం సోషల్ మీడియాలో వెలుగులోకి రావడంతో కాంగ్రెస్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. కాగా, రాజాను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa