ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్డీయే నాయకులకు ముందే మాట ఇచ్చేశానన్న జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 31, 2025, 09:57 PM

ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగవంతమయ్యాయి. ఇండియా కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో ఉన్న జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ కు ఫోన్ చేశారు. ఈ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని ఆయన జగన్‌ను కోరారు.జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అభ్యర్థనకు జగన్ సున్నితంగా బదులిచ్చారు. ఇండియా కూటమి తమ అభ్యర్థిని ప్రకటించకముందే ఎన్డీయే నాయకులు తనను సంప్రదించారని, వారికి మద్దతు ఇస్తామని మాట ఇచ్చామని జగన్ వివరించారు. ఈ కారణంగా ఇప్పుడు మీకు సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వలేకపోతున్నామని స్పష్టం చేశారు. అయితే, న్యాయమూర్తిగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి దేశానికి, ప్రజలకు అందించిన సేవలు ఎనలేనివని, ఆయనపై తనకు వ్యక్తిగతంగా అపారమైన గౌరవం ఉందని జగన్ పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో తన నిర్ణయాన్ని మరోవిధంగా భావించవద్దని జగన్ విజ్ఞప్తి చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa