అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పిటిషన్‌పై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. పదేళ్లుగా ఒక హత్య కేసులో స్టే ఎలా పొడిగిస్తున్నారని ప్రశ్నించింది. ఇకపై వాయిదాలు వేయలేమని తెలిపింది. దగ్గుపాటి ఎంపీపీగా ఉన్న సమయంలో అతనిపై హత్య కేసు నమోదైంది. ఈ కేసులో స్టే విధించాలని దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు పై వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa