ఆస్ట్రేలియాలో వలస వ్యతిరేక నిరసనలు ఉద్ధృతం అయ్యాయి. ఆదివారం రోజు దాదాపు 20 నగరాల్లో సామూహిక వలసలకు వ్యతిరేకంగా వేలాది మంది ఆస్ట్రేలియన్లు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ముఖ్యంగా భారత సంతతికి చెందిన వారిని లక్ష్యంగా చేసుకున్నారు. మరి ఈ నిరసనల వెనుక వ్యక్తులు ఎవరు, భారతీయులను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తవానికి ఆస్ట్రేలియా జనాభాలో వలసలు ఎప్పటి నుంచో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయాయి. చారిత్రక వలసల నమూనాలతో పోల్చినప్పుడు.. భారతీయ వలసదారుల సంఖ్య శాతం పరంగా పెరిగినప్పటికీ.. దేశ జనాభాలో వారి శాతం ఇప్పటికీ స్వల్పమే. గడిచిన కొద్ది సంవత్సరాలలో భారతదేశం నుంచి వలస వచ్చిన వారి సంఖ్య కాస్త పెరిగింది. బ్రిటన్ తరువాత ఆస్ట్రేలియాలో రెండో అతిపెద్ద వలస సమాజం భారతీయ సంతతి వారిదే. అయితే సుమారు 8.4 లక్షల మంది భారతీయ మూలాలున్నవారు ఆస్ట్రేలియాలో నివసిస్తున్నప్పటికీ.. ఇది దేశ జనాభాలో కేవలం 3.2 శాతానికి మాత్రమే పరిమితం అయింది.
యాసిడ్‌తో పనిలేదు టాయిలెట్ సీట్‌పై ఉన్న పసుపు మరకల్ని వదిలించే ఒకే ఒక చిట్కా, మరకలతో పాటు దుర్వాసన మాయం
ఇదీ చదవండి: అమెరికా డ్రీమ్ కోసం లక్షలు ఖర్చు.. అక్రమ వలసదారులుగా ముద్ర.. భారతీయుల ఆవేదన
కానీ నిరసనకారులు మాత్రం గత ఐదు సంవత్సరాలలో ఆస్ట్రేలియాకు వచ్చిన భారతీయుల సంఖ్య, గత 100 సంవత్సరాలలో గ్రీక్, ఇటాలియన్ల కంటే ఎక్కువ అంటూ ఆరోపిస్తున్నారు. ఇది కేవలం వలసలకు సంబంధించిన విషయం మాత్రమే కాదని.. దేశ జనాభా, సంస్కృతిని నాశనం చేసే ప్రయత్నమని చెప్పారు. అందుకే భారతీయులు దేశాన్ని వదిలి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు. ఈ వాదనలు జాత్యహంకారంపై ఆధారపడి ఉన్నాయని ఆస్ట్రేలియా ప్రభుత్వం, ప్రతిపక్షాలు ముక్తకంఠంతో ఖండించాయి. ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ సైతం దీనిపై స్పందించి.. ఈ ఆరోపణలు సరైనవి కావన్నారు.
మరోవైపు ఆస్ట్రేలియా దేశ సాంస్కృతిక వ్యవహారాల మంత్రి అన్నా అలి.. ఆస్ట్రేలియా ఒక బహుళ-సంస్కృతిక దేశమని, ఈ రకమైన జాతి వివక్షలకు, విద్వేషాలకు ఇక్కడ తావు లేదని స్పష్టం చేశారు. ఈ ర్యాలీలు దేశంలో విభజనను సృష్టించేందుకు చేస్తున్నవని, సమాజంలో సామరస్యానికి ఇవి తోడ్పడవని ఆమె అన్నారు. ముఖ్యంగా నియో-నాజీలతో ఈ ర్యాలీలకు ఉన్న సంబంధాలపై దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు.
ఈ నిరసనల కారణంగా ఆస్ట్రేలియాలోని భారతీయ సమాజం భయాందోళనలకు గురవుతోంది. ఈ పరిస్థితిపై భారత ప్రభుత్వం కూడా స్పందించింది. ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులు, నివాసితులు సురక్షితంగా ఉన్నారని నిర్ధారించుకోవాలని.. వారి భద్రతకు సంబంధించి ఆస్ట్రేలియా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. జాతి వివక్ష లేదా విద్వేషపూరిత చర్యలు ఎదుర్కొంటే వెంటనే భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa