అతడికి 25 ఏళ్లు. ఆమెకు 52 ఏళ్లు. కానీ ఆ మహిళ.. ఫిల్టర్లు ఉపయోగించి.. తన వయసును 27 ఏళ్లు తగ్గించుకుంది. తన మొహాన్ని ఫిల్టర్ల సాయంతో యువతి లాగా తయారు చేసుకుని.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు చూసిన ఓ పాతికేళ్ల కుర్రాడు.. ఆమెను ఇష్టపడ్డాడు. చివరికి కలుసుకున్నాడు. అలా వారి ప్రేమ ప్రయాణం మొదలైంది. కానీ ఆమె వయసు 25 కాదు.. 52 అని బయటపడింది. తనకంటే 27 ఏళ్లు పెద్దది అని తెలిసినప్పటికీ.. అతడు తన ప్రేమాయణాన్ని కొనసాగించాడు. ఈ క్రమంలోనే ఆమె నుంచి ఆ యువకుడు కొంత డబ్బును కూడా తీసుకున్నాడు. చివరికి తనను పెళ్లి చేసుకోవాలని.. తన డబ్బులు తనకు ఇవ్వాలని.. ఆ మహిళ యువకుడిపై ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో వారిద్దరి మధ్య జరిగిన ఘర్షణల్లో ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆ యువకుడు అక్కడి నుంచి పారిపోయినా.. పోలీసుల చేతికి మాత్రం చిక్కకుండా తప్పించుకోలేకపోయాడు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 25 ఏళ్ల యువకుడు.. 52 ఏళ్ల తన ప్రియురాలిని గొంతు నులిమి అతి దారుణంగా హత్య చేశాడు. ఫరూఖాబాద్‌కు చెందిన 52 ఏళ్ల రాణి దేవి అనే మహిళకు.. మెయిన్‌పురికి చెందిన 25 ఏళ్ల అరుణ్ రాజ్‌పుత్‌తో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. అరుణ్ రాజ్‌పుత్ ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వారిద్దరి మధ్య 27 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉండగా.. అది తెలియకుండా ఉండేందుకు రాణి దేవి.. ఫిల్టర్లు ఉపయోగించి.. తన వయసు 25 ఏళ్లు అని అరుణ్ రాజ్‌పుత్‌ను నమ్మించింది.
ఇలా సోషల్ మీడియాలో ఏర్పడిన వారి పరిచయం క్రమంగా స్నేహానికి, ఆ తర్వాత ప్రేమకు దారితీసింది. అయితే తన వయసును దాచి.. 25 ఏళ్లు అని నమ్మించేందుకు ఫోన్‌లో కెమెరా ఫిల్టర్లు ఉపయోగించి యవ్వనంగా కనిపించేలా చేసింది. వారి స్నేహం కొన్ని రోజులకే ప్రేమ బంధంగా మారింది. ఆ తర్వాత వారిద్దరూ తరచూ కలుసుకునేవారు. అయితే మొదట్లో రాణి దేవి వయసును గుర్తించని అరుణ్ రాజ్‌పుత్.. ఆ తర్వాత తెలుసుకున్నాడు. అయినప్పటికీ రాణి దేవితో సంబంధం కొనసాగించిన అరుణ్ రాజ్‌పుత్.. ఈ క్రమంలోనే ఆమె నుంచి రూ.1.5 లక్షలు తీసుకున్నాడు.
ఇక గత నెల 10వ తేదీన తన డబ్బు తిరిగి ఇవ్వాలని లేదా తనను పెళ్లి చేసుకోవాలని అరుణ్ రాజ్‌పుత్‌పై రాణి దేవి ఒత్తిడి తీసుకువచ్చింది. దీంతో వారిద్దరి మధ్య గొడవ తలెత్తింది. తీవ్ర ఆగ్రహానికి గురైన అరుణ్ రాజ్‌పుత్.. రాణి దేవిని మెయిన్‌పురిలోని ఒక ఏకాంత ప్రాంతానికి రమ్మని పిలిచాడు. అక్కడ మళ్లీ వారిద్దరి మధ్య గొడవ జరగ్గా.. ఆవేశంతో అరుణ్ ఆమె మెడలోని స్కార్ఫ్‌తో గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం.. రాణి దేవి మృతదేహాన్ని అక్కడే పడేసి పరారయ్యాడు.
స్థానికుల ఫిర్యాదుతో రాణి దేవి మృతదేహాన్ని మరుసటి రోజు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపిన ఎస్పీ అరుణ్ కుమార్.. నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లు పేర్కొన్నారు. పెళ్లి చేసుకోవాలని.. డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి తీసుకురావడం.. పెళ్లికి వయసు అడ్డు రావడం వంటి కారణాలతో అరుణ్ కుమార్ రాణి దేవిని హత్య చేసినట్లు గుర్తించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa