ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పదే పదే మూత్రం వస్తుంటే తేలికగా తీసుకోవద్దు, ఇది ఇన్ఫెక్షన్ కావచ్చు

Health beauty |  Suryaa Desk  | Published : Wed, Sep 03, 2025, 10:45 PM

వర్షాకాలం వచ్చిందంటే ఎండ నుంచి ఉపశమనం దొరికిందని ఆనందపడినప్పటికీ ఈ టైమ్‌లోనే బ్యాక్టీరియా పెరుగుతుంది. దీంతోపాటు, అపరిశుభ్రమైన పబ్లిక్ టాయి‌లెట్ వాడినప్పుడు, సరైన హైజీన్ మెంటెయిన్ చేయనప్పుడే యూటిఐ సమస్య పెరుగుతుంది. అవి మాత్రమే కాదు టైట్‌గా ఉండే ఇన్నర్స్, సింథటిక్ ఇన్నర్ వేర్ వాడే వారు ముఖ్యంగా ఆడవారికి మూత్రనాళాల ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి. కాబట్టి, జాగ్రత్తగా ఉండాలి. ఆడవారి మూత్ర నాళం ఆసన ద్వారానికి దగ్గర ఉంటుంది, సరైన పరిశుభ్రత పాటించకపోతే సూక్ష్మజీవులు, ఇతర హానికరమైన సూక్ష్మజీవులు మూత్రనాళాన్నిఎఫెక్ట్ చూపిస్తుంది. రెండోవది, పురుషుల కంటే ఆడవారిలో మూత్రనాళం తక్కువగా ఉంటుంది. కాబట్టి, ఇన్ఫెక్షన్ రేట్ పెరుగుతుంది. అసలు ఈ సమస్య రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.


వర్షాకాలంలో సమస్యకి కారణాలు


వర్షాకాలంలో వాతావరణం తేమగా ఉండడంతో బ్యాక్టీరియా పెరుగుతుంది. అదే విధంగా, ఈ టైమ్‌లో ఎక్కువగా బట్టలు ఆరవు. చాలా మంది అలానే వేసుకుంటారు. దీంతో ఈకోలి వంటి బ్యాక్టీరియా పెరిగి సమస్య వస్తుంది. అందుకే, ఎప్పుడు కూడా తడిబట్టలు వేసుకోవద్దు. ముఖ్యంగా ఇన్నర్ వేర్స్‌ని. నార్మల్ టైమ్ కంటే ఈ టైమ్‌లో రెండు జతల బట్టలు ఎక్స్‌ట్రా ఉంచుకోండి. పూర్తిగా తడి ఆరన బట్టలే వేసుకోవడం మంచిది.


​పీరియడ్స్ టైమ్‌లో సమస్య మరింత పెరుగుతుంది. ఆ టైమ్‌లో ప్యాడ్స్ ఎక్కువసేపు ఉంచుకోకుండా నాలుగైదు గంటలకోసారైనా ప్యాడ్స్ మారాలి. టాంపూన్స్, మెనుస్ట్రువల్ కప్స్‌ వాడితే వాటిని కూడా క్లీన్ చేసి వాడడం అలవాటు చేసుకోండి.


ఇతర కారణాలు


సీజనల్ మార్పుల కారణంగా ఇమ్యూనిటీ తగ్గుతుంది. తడిగా ఉండే వాతావరణం కారణంగా, ఇమ్యూనిటీ తగ్గడం వల్ల బ్యాకటీరియా ఒంట్లోకి ప్రవేశించి సమస్యలకి కారణమవుతుంది. కాబట్టి, ఇమ్యూనిటీ సరిగ్గా ఉండేందుకు సరైన ఆహారం తీసుకోవాలి. విటమిన్ సిని యాడ్ చేసుకోవడం మంచిది. అదే విధంగా, చాలా మంది వర్షాకాలంలో ఎక్కువగా దాహం వేయట్లేదంటూ నీరు తాగరు. దీంతో కూడా డీహైడ్రేషన్ పెరిగి మూత్రం సరిగ్గా వెళ్లకుండా బాడీలోనే బ్యాక్టీరియా పేరుకుపోయి సమస్య వస్తుంది. కాబట్టి, నీటిని పుష్కలంగా తాగాలి. ఎప్పటికప్పుడు మూత్రవిసర్జన చేయాలి.


లక్షణాలు


మూత్రనాళ ఇన్ఫెక్షన్ గురించి ముందుగా తెలుసుకోవాలి. కొన్ని లక్షణాలని బట్టి గుర్తించాలి. అప్పుడు దాన్ని బట్టి జాగ్రత్తలు తీసుకోవచ్చు.


మూత్ర విసర్జన సమయంలో మంటపొత్తికడుపు నొప్పిమూత్రనాళం చుట్టూ నొప్పిఎక్కువ సార్లు మూత్ర విసర్జనమూత్రాన్ని కంట్రోల్ చేయలేకపోవడంచలితోపాటు జ్వరంమూత్రం వాసన రావడం


ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. లేదంటే సమస్య పెరిగితే అది మూత్రనాళం పైకి ప్రయాణించి కిడ్నీల ఇన్ఫెక్షన్స్‌కి కారణమవుతుంది.


ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?


యూటిఐ సమస్య రాకుండా ఎప్పటికప్పుడు జననేంద్రియ ప్రాంతాన్ని క్లీన్‌గా ఉంచుకోవాలి. మైల్డ్ సోప్‌, నీటితో క్లీన్ చేయాలి. ఎప్పుడు కూడా టాయిలెట్‌ వెళ్లాక ముందు నుంచి వెనక్కి క్లీన్ చేయాలి. దీని వల్ల బ్యాక్టీరియా పెరగదు.


​ప్రైవేట్ పార్ట్స్ ఎప్పుడు కూడా తడిగా ఉండొద్దు. లూజ్‌గా గాలి తగిలే విధంగా ఇన్నర్ వేర్ వేసుకోవాలి.


నీరు ఎక్కువగా తాగాలి. దీంతో బ్యాక్టీరియా మూత్రం ద్వారా బయటికి వెళ్లిపోతుంది. రోజుకి కనీసం 8 గ్లాసుల నీరు తాగాలి.


మూత్రాన్ని అసలే ఆపుకోవద్దు.


హెల్దీ డైట్ మెంటెన్ చేయాలి. విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి. మంచి నిద్ర ఉండేలా చూసుకోండి.


స్ట్రెస్‌ని తగ్గించుకోండి.


క్రాన్‌బెర్రీ జ్యూస్ తీసుకుంటే చాలా వరకూ మూత్రనాళ ఇన్ఫెక్సన్ తగ్గుతుంది.


బయటికి వెళ్లినప్పుడు ఏం చేయాలి?


మూత్రనాళ ఇన్ఫెక్షన్ రావడానికి ముఖ్య కారణాల్లో ఒకటి అపరిశుభ్రమైన టాయిలెట్ వాడడం.


బయటికి, టూర్స్‌కి వెళ్లినప్పుడు టాయిలెట్స్ ఉండవు. ఇందులో టాయిలెట్ వెళ్లినప్పుడు సమస్య వస్తుంది. కాబట్టి, ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.


పబ్లిక్ టాయిలెట్స్ వాడినప్పుడు శానిటైజర్స్ వాడాలి. స్ప్రే శానిటైజర్స్ వాడాలి. మనం వాడే ముందే దీనిని స్ప్రే చేస్తే మంచిది.


వైప్స్ వాడాలి. ఇవి కూడా ఎక్కువగా కెమికల్స్‌ లేనివి నేచురల్‌గా తయారైనవి వాడాలి.


ఎప్పటికప్పుడు మన ప్రైవేట్ పార్ట్స్‌ని క్లీన్‌గా ఉంచుకోవాలి. తడిగా అవ్వకుండా చూసుకోవాలి. దీనికోసం పౌడర్స్ వాడొచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa