పెళ్ళైన 5 నెలలకే ఓ భార్య తన భర్తకు షాకిచ్చింది. తాను బాయ్ ఫ్రెండ్‌తో పెళ్లి చేసుకుంటున్నానని.. వాట్సాప్‌లో భర్తకు ఫొటోలు పంపింది. బీహార్‌లో ముజఫర్‌పూర్‌లో ఈ ఘటన జరగ్గా.. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. తను వెళ్లిపోతూ ఇంట్లో రూ. 53వేల నగదు, రూ. 1.70లక్షల విలువైన ఆభరణాలు తీసుకెళ్లిందని చెప్పాడు. తన భార్య ‘సారీ.. నేను ఇతడిని పెళ్లి చేసుకుంటున్నా’ అంటూ ఫొటోలు కూడా పంపిందని తెలిపాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa