AP: విశాఖ తీరంలో కైలాసగిరిపై ‘గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జి’ ఏర్పాటైంది. విశాఖలోనే కాదు.. రాష్ట్రంలోనే తొలిసారిగా ఇలాంటి అద్దాల బ్రిడ్జి ఏర్పాటు కాగా.. వారంలో అందుబాటులోకి రానుంది. పీఎంఆర్‌డీఏ నిర్వహిస్తున్న పర్యాటక కేంద్రం కైలాసగిరిపై పీపీపీ విధానంలో ఈ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. రూ.7 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ వాక్ వేపై ఒకేసారి 50 మంది నడవచ్చు. ఇది కొండపై నుంచి సముద్రం వైపు సుమారు వంద అడుగుల పొడవు ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa