బ్రిటన్ రాజకీయాల్లో ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశ హోం మంత్రి (హోం సెక్రటరీ) పదవిని తొలిసారిగా ఒక ముస్లిం మహిళ చేపట్టారు. పాకిస్థాన్ మూలాలున్న షబానా మహమూద్ ఈ కీలక బాధ్యతలను స్వీకరించి చరిత్ర సృష్టించారు.ప్రధాని కీర్ స్టార్మర్ తన మంత్రివర్గంలో చేపట్టిన పునర్వ్యవస్థీకరణలో భాగంగా షబానాను ఈ పదవిలో నియమించారు. ఏంజెలా రేనర్ రాజీనామా అనంతరం య్వెట్ కూపర్ స్థానంలో ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నియామకంతో దేశ అంతర్గత భద్రత, వలస విధానాలు, పోలీసింగ్ వంటి అత్యంత కీలకమైన విభాగాలు షబానా పర్యవేక్షణలోకి వస్తాయి. ప్రస్తుతం దేశం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో ఆమె నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa