అమరావతి క్వాంటమ్ మిషన్ అపెక్స్ కమిటీ చైర్మన్‌గా ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ కె. కామకోటి, నిపుణుల కమిటీ చైర్మన్‌గా ఐఐటీ తిరుపతి డైరెక్టర్ ప్రొఫెసర్ కేఎన్ సత్యనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ఆదివారం ఉత్తర్వు జారీ చేశారు. అపెక్స్ కమిటీ కో-చైర్మన్‌గా ప్రొఫెసర్ శ్రీకాంత్ శాస్త్రి, సభ్య కార్యదర్శిగా కాటంనేని భాస్కర్‌తో పాటు మరో 11 మంది సభ్యులుగా వ్యవహరిస్తారు. అదేవిధంగా నిపుణుల కమిటీ కో-చైర్మన్‌గా అరిధామ్ ఘోష్ (ఐఐఎ్‌ససీ బెంగళూరు), సభ్య కార్యదర్శిగా రాష్ట్ర ఐటీ శాఖ ప్రత్యేక కార్యదర్శి బి. సుందర్‌తో పాటు మరో 10 మంది సభ్యులు ఉంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa