ఆసియా హాకీ కప్ 2025లో భారత హాకీ జట్టు అద్వితీయ విజయం సాధించింది. బీహార్‌లోని రాజ్‌గిర్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ దక్షిణ కొరియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 4-1 తేడాతో గెలుపొందింది. ఈ ఘన విజయంతో భారత్ నాలుగోసారి ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది. అంతేగాక, వచ్చే ఏడాది జరిగే హాకీ ప్రపంచకప్‌కు అర్హత సాధించింది.ఇంతకు ముందు భారత్ 2003, 2007, 2017లో ఆసియా కప్ విజేతగా నిలిచింది. ఇప్పుడు 8 ఏళ్ల అనంతరం మరోసారి కప్‌ను సొంతం చేసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa