ఒడిశాలోని అంగుల్ జిల్లాలో దారుణమైన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 11 ఏళ్ల బాలికపై అత్యంత దారుణంగా దుండగులు హత్యాచారానికి పాల్పడ్డారు. 5వ తరగతి చదువుతున్న బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు గ్రామంలో వెతికారు. బాలిక మృతదేహం సమీపంలోని ఓ కాలువలో నగ్నంగా, శరీరంపై గాయాలతో కనిపించింది. అలాగే బాలిక కళ్లు కూడా పీకేసినట్టు గుర్తించారు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి ఫోరెన్సిక్, డాగ్ స్క్వాడ్ బృందాలతో కలిసి తనిఖీలు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa