బీహార్ లో అమానుష సంఘటన చోటుచేసుకుంది. ఇటీవలి వర్షాలకు కతిహార్ ప్రాంతం వరదల్లో మునిగిపోగా.. బాధితులను పరామర్శించి, ధైర్యం చెప్పేందుకు స్థానిక ఎంపీ తారిఖ్ అన్వర్ అక్కడ పర్యటించారు. ఈ పర్యటనలో ఎంపీ తారిఖ్ అన్వర్ ను ఓ గ్రామస్థుడు వీపుపై మోసుకెళుతున్న వీడియో ఒకటి బయటికి రావడం విమర్శలకు దారితీసింది. గ్రామస్థుడి వీపుపైకెక్కి కాలికి బురద అంటకుండా వరద ప్రాంతాల్లో పర్యటించిన ఎంపీ అంటూ బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ విమర్శల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ.. ఎంపీ తారిఖ్ ఆ సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్నారని, అందుకే గ్రామస్థుడు ఆయనను మోసుకెళ్లాడని సమర్థించుకునే ప్రయత్నం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa